Movies

వర్మ మూవీలో ప్రియాంక సోదరి

రాంగోపాల్‌ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా (రోగ్‌ ఫేం) నటించనున్నట్లు బాలీవుడ్‌ టాక్. మన్నారా.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన రోగ్‌ సినిమాకి సంతకం చేసినప్పుడే వర్మతో తదుపరి సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఓ పక్క వర్మ అమితాబ్‌తో ‘సర్కార్‌-3’, అభిషేక్‌ బచ్చన్‌తో ‘అరెస్ట్‌’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ.. మన్నారాకి అరెస్ట్‌ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు మన్నారా వర్మను కలిసినప్పుడు తనకు ‘రంగీలా’ లాంటి సినిమా చేయాలనుందని చెప్పిందని టాక్.