Featured Social

వాట్సాప్ స్లీపింగ్ మోడ్.. పేలిన జోకులు..సారీ చెప్పిన యాజమాన్యం..

 

 

 

 

 

 

 

 

 

వాట్సాప్ కొన్ని గంటలపాటు నిద్రపోయింది. అంతే నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వాట్సాప్‌ అధికార ప్రతినిధి తమ యూజర్లకు కలిగిన అసౌకర్యంపై క్షమాపణ చెప్పారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బుధవారం రాత్రి వాట్సాప్‌ పనిచేయలేదు. కొన్ని దేశాలకు పగలు కాగా, మరికొన్ని దేశాలకు అది రాత్రి. మనం నిద్రపోయినట్లుగా వాట్సాప్‌ కూడా అప్పుడప్పుడు నిద్రపోతుంది తెలియదా అంటూ జోక్స్‌ పేలుస్తూ వాట్సాప్‌ డౌన్‌, వాట్సాప్‌ ఈజ్‌ డౌన్‌ అని హ్యాష​ ట్యాగ్స్‌ తో ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ లలో నెటిజన్లు కామెంట్లు పోస్టు చేశారు. ముఖ్యంగా భారత్‌ తో పాటుగా బ్రెజిల్‌, అమెరికా, కెనడా దేశాలలో యాప్‌ పనిచేయలేదు.

దీనికి కారణాలేంటన్న దానిపై వాట్సాప్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఐఫోన్‌ యూజర్లు, ఆండ్రాయిడ్‌ యూజర్లు, మైక్రోసాఫ్ట్‌ మొబైల్స్‌ వాడుతున్న వారికి ఈ ఇబ్బందులు తలెత్తాయని మాత్రం చెప్పింది. దాదాపు వంద కోట్లకు పైగా యూజర్లు ఉన్న వాట్సాప్‌ రెండు గంటల పాటు రెస్పాండ్‌ కాలేదు. వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే కనెక్టింగ్‌ అని చాలాసమయం డిస్‌ ప్లే అయిందట. దీంతో సోషల్‌ మీడియాలో కుళ్లు జోకులు పేలాయి. చివరకు వాట్సాప్ ఒక మెట్టుదిగి యూజర్లకు క్షమాపణ చెప్పింది.