Featured2 Latest News Social

విమానంలో తేలు

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని విమానంలో తేలు కుట్టింది. రిచర్డ్‌ బెల్‌ అనే వ్యక్తి భార్య లిండాతో కలిసి హూస్టన్‌ నుంచి కాల్గరీకి యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో ప్రయాణిస్తున్నారు. వీరిద్దరూ బిజినెస్‌ క్లాస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారు.
రిచర్డ్‌ లంచ్‌ చేస్తుండగా పైనున్న లగేజ్‌ నుంచి ఓ తేలు అతని తలపై పడింది. తలపై ఏదో పడినట్లు చేత్తో విదింలిచేసరికి అది ముందున్న టేబుల్‌పై పడింది. తోటి ప్రయాణికులకు హాని కలుగుతుందేమోనని భావించి దాన్ని తీయబోతుండగా కుట్టింది. దాన్ని చూసి మిగతా ప్రయాణికులు హడిలిపోయారు. వెంటనే విమాన సిబ్బందిని అక్కడికి చేరుకుని ఆ తేలును తీసి టాయ్‌లెట్‌లో పడేశారు. గాయపడ్డ రిచర్డ్‌కి వెంటనే వైద్యసేవలు అందించారు. విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం రిచర్డ్‌కి క్షమాపణలు చెప్పి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది.