Latest News

విమానంలో ప్రసవం..తల్లీబిడ్డ క్షేమం..

టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ పండంటి శిశువుకు జన్మనిచ్చింది. విమానం గునియా రాజధాని కాంక్రే నుంచి ఇస్తాంబుల్ బయల్దేరింది…. 42 వేల అడుగుల ఎత్తులో విమానం వెళుతుండగా, సరిగ్గా అప్పుడే ఆమెకి పురుటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు వెంటనే స్పందించి ఆమెకు ప్రసవం చేశారు. ముద్దులొలికే ఆడబిడ్డ పుట్టడంతో విమానంలోని అందరూ సంతోషపడ్డారు.. 28 వారాల సదరు గర్భిణి నఫీ దుబే వాస్తవానికి మరో రెండు నెలల తర్వాత ప్రసవించాల్సి ఉంది. అయితే ఆమెకు ముందుగానే పురుటినొప్పులు రావడంతో విమానంలోనే ప్రసవం అయింది.

సత్వరం స్పందించి సాయపడిన విమాన సిబ్బందిపై టర్కిష్ ఎయిర్ లైన్స్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ పాపకు కదిజు అని పేరుకూడా పెట్టేశారు.. తల్లీ, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారనీ… వారిని బర్కినా ఫాసోలోని ఓ ఆస్పత్రిలో చేర్చినట్టు వెల్లడించింది. మరోవైపు ఈ సంఘటన పట్ల విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆకాశంలో పుట్టింది కాబట్టి ఆ పాప బర్త్ సర్టిఫికెట్‌లో ఏ ఊరి పేరు రాస్తారో అని ఒకరు సరదాగా ట్వీట్ చేయగా… క్యాబిన్ క్రూ అంటే కేవలం కాఫీ అందించేవారు మాత్రమే కాదని రుజువైందని మరో నెటిజన్ పొగిడాడు.