Social Trends

విమానాల్లో బికినీ భామలు..!

హీరోయిన్స్, మోడల్స్ లే కాదు..ఇప్పడు ఎయిర్‌హోస్టెస్‌లు బికినీల్లో కనిపిస్తున్నారు. వియత్నాంకు చెందిన వియతజెట్‌ అనే ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే ఎయిర్‌హోస్టెస్‌లు బికినీ లేదా షర్టు- షార్ట్స్‌లో హాజరుకావొచ్చని ఆ సంస్థ యజమాని ఎమ్‌ఎస్‌ థావో చెప్పారు. అది కూడా బీచ్‌లకు వెళ్లే విమానాల్లోని ఎయిర్‌ హోస్టెస్‌లకు మాత్రమే. అయితే వారు మాత్రం టూపీస్‌ దుస్తుల్లోనే దర్శనమిస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు అనూహ్యంగా పెరుగుతున్నారు. వాస్తవానికి వియతజెట్‌లోని ఎయిర్‌హోస్టెస్‌లు ఇలా బికినీల్లో విధులకు కావటం ఇది రెండోసారి.

గతంలో 2011లో ఈ ఎయిర్‌లైన్స్‌ యజమాని ఏకంగా ఎయిర్‌హోస్టెస్‌లతో ఫ్యాషన్‌షూట్‌ చేయటమే కాకుండా, విమానంలో బికినీ షో చేయించారు. పాపులారిటీ కోసమే వియతజెట్‌ ఎయిర్‌లైన్స్‌ అలా చేసింది. దీంతో విమానసంస్థల బోర్డు 2012లో ఈ విమానసంస్థపై జరిమానా విధించింది. ఈ దెబ్బతో బ్యాడ్‌నేమ్‌ వస్తుందనుకున్నారంతా. విచిత్రంగా ‘బికినీ ఎయిర్‌లైన్స్‌’ అని అందరూ ముద్దుగా పిలవటం మొదలెట్టారు. దెబ్బకి భారీ లాభాలొచ్చాయి.