Latest News Trends

వైరల్‌గా తండ్రీకూతుళ్ల ‘హిజాబ్‌’చర్చ హ్యాట్సాఫ్‌ చెబుతోన్న నెటిజన్లు

హిజాబ్ , బుర్ఖా పై ఓ ముస్లిం తండ్రికి, కూతురికి మధ్య జరిగిన చర్చ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆ తండ్రికి అభినందనలు చెబుతున్నారు.అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన లామ్యా అల్షేరి అనే యువతి ఓరోజు తన స్నేహితురాలితో చాట్‌ చేస్తోంది. మాటల మధ్యలో లామ్యాస్నేహితురాలు.. ‘నేను హిజాబ్‌ వేసుకోకపోతే మా నాన్న నాపై కోప్పడతారు’ అని చెప్పింది. దాంతో లామ్యా ఆలోచనలో పడింది. హిజాబ్‌ ధరించకపోతే తన తండ్రి కూడా ఇలాగే అరుస్తాడా డౌట్ పడింది. ఈ విషయం గురించి తన తండ్రితో మాట్లాడాలనుకుంది. వెంటనే ట్విటర్‌లో తన తండ్రికి ‘నేను హిజాబ్‌ వేసుకోవాలనుకోవడంలేదు. ఎంతైనా మీలాంటి చాలా మందికి ముస్లిం ఆడపిల్లలు హిజాబ్‌ ధరించాలి అనే ఒకే ఆలోచనా తీరు ఉంటుంది కదా ’ అని మెసేజ్‌ పెట్టింది.
లామ్యా అడిగిన దానికి ఆమె తండ్రి సమాధానంగా.. ‘స్వీట్‌హార్ట్‌.. ఇది నా నిర్ణయం కాదు. అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు ఏ వ్యక్తికీ లేదు. నీకు ఏదనిపిస్తే అది చేయచ్చు. నాకే అభ్యంతరం లేదు. ఏదేమైనా నీ వెనక నేనున్నా’ అని ట్వీట్‌ చేశాడు. తన తండ్రి అభిప్రాయం విని లామ్యా ఎంతో సంతోషించింది. ఆ తర్వాత ‘కేవలం మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని ఇలా చేశాను.. నిజానికి నేను హిజాబ్‌ తీయాలనుకోవట్లేదు. లవ్యూ డాడీ’ అని లామ్యా రీ ట్వీట్‌ చేసింది.
వీరిద్దరి మధ్య చర్చ ఎంత వైరల్‌గా మారిందంటే.. లామ్యా చేసిన ట్వీట్‌కి 3.2 లక్షల లైక్‌లు, 1.4 లక్షల రీట్వీట్లు వచ్చాయి. మతం పేరిటఆడపిల్లకి నిబంధనలు విధించే ఈ రోజుల్లో ఓ తండ్రి తన కుమార్తెకు ఇస్తున్న సపోర్ట్‌ చూసి ఎందరో నెటిజన్లు వీరిద్దరికీ