Latest News Technology

వేగం మించితే సెఫ్టీ ఫీచర్లు జీరో..


కారు ఖరీదైనదే. ప్రాణం అంతకన్నా ఖరీదైంది. వేగం మించితే ఎన్ని ఎయిర్ బ్యాగ్ లు ఉన్నా గాల్లో కలిపోవాల్సిందే. ఎంత టాప్ మోస్ట్ సెఫ్టీ కారైనా ముల్లు స్పీడోమీటర్ చివరి అంచుల్లోకి చేరితే లైఫ్ మటాషే. బెంజైనా గింజైనా ప్రాణాలకు నో గ్యారంటీ.

కారు ఎంత ఖరీదైనా.. ! ఏ మోడలైనా..! ఎంత సెక్యురిటీ ఉన్నా..!ఎన్ని ఎయిర్‌ బ్యాగులున్నా..! అవన్నీ ‘వేగం’ ముందు జీరో. వేగం పరిమితి మించితే.. ప్రాణాలకు నో గ్యారెంటీ. ఎంత ఖరీదైన వాహనమైనా.. కంట్రోల్‌ తప్పితే.. కాటికే. కారులో ఎంత గట్టిదైనా.. నిండా టెక్నాలజీ ఉన్నా.. స్పీడు పెరిగితే.. కీడే. తాజా మెర్సిడిస్‌ జీ63 ప్రమాదాన్ని పరిశీలిస్తే.. ఇది అక్షరసత్యం.. ఫీచర్లు.. మెటల్‌.. టెక్నాలజీ.. అన్నీ అత్యద్భుతంగా ఉన్నా.. నిషిత్ ప్రాణాలను మాత్రం నిలబెట్టలేకపోయాయి.

మెర్సిడెస్‌ జీ 63.. తొలిసారిగా 1970లో తయారైనా కాలానుగుణంగా ఇందులో సౌకర్యాలు, సెక్యురిటీ ఫీచర్లు పెంచుతూ వస్తున్నారు. అత్యధిక వేగంతో వెళ్లేందుకు, రహదార్లు సరిగా లేని ప్రాంతంలోనూ తిరిగేందుకు దీన్ని రూపొందించారు. డిజైన, పనితీరు, టెక్నాలజీ విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఈ వాహనాన్ని రూపొందించారు. బాడీ తయారీలో గాల్వనైజ్‌డ్‌ స్టీల్‌ని ఉపయోగించారు. ఇది అత్యంత కఠినంగా.. ధృఢంగా ఉంటుంది.
ఈ కారులో అన్ని వైపులా ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో అతి తక్కువ సమయంలో తెరుచుకొని ప్రాణం కాపాడేందుకు తోడ్పడతాయి. ఫ్రంట్‌ ఇంపాక్ట్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ఓవర్‌ హెడ్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ ముందు సీట్లో కూర్చున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ వాహనం తలకిందులుగా పడినా, లేక ఇతర వాహనాలు సైడ్‌ నుంచి ఢీకొట్టినా తల భాగానికి గాయాలు కాకుండా ఓవర్‌ హెడ్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ కాపాడుతాయి. సీట్‌ బెల్ట్స్‌ ప్రమాదం జరిగిన సమయంలో మరింత టైట్‌ అవుతాయి. సీటులో వ్యక్తి ముందుకు జారకుండా చేస్తాయి.
స్టెబిలిటీ కంట్రోల్‌ వ్యవస్థ.. వాహనం అతి వేగంగా వెళ్తున్న సమయంలో కంట్రోల్‌ తప్పకుండా చేస్తుంది. ఇంజిన వేగాన్ని అదుపు చేస్తుంది. వేగం విషయంలో డ్రైవర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. వేగం మితిమీరినపుడు వాహనం అదుపు తప్పకుండా నిత్యం బ్రేకులు వేసి.. వేగాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఇన్ని ఫీచర్లున్నా నిషిత్ ప్రాణాలు మాత్రం దక్కలేదు.