Sports

సచిన్ కు తొలి బ్యాట్ ఇచ్చింది ఎవరంటే…

 

 

 

 

 

 

 

 

 

ఎంతటి పెద్ద క్రికెటరైనా తొలిసారి బ్యాట్‌ పట్టుకున్న రోజుని మాత్రం మర్చిపోలేడు. అందుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ మినహాయింపు కాదు. లిటిల్‌ మాస్టర్‌ జీవితాధారంగా ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా రాబోతోంది.
ఈ సినిమా నిర్మాత రవి భాగ్‌చంద్కా సచిన్‌ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సచిన్‌కి తొలి బ్యాట్‌ను అతని సోదరి సవిత కానుకగా ఇచ్చారట. అది కూడా ఈ బ్యాట్‌ని ప్రత్యేకంగా కశ్మీర్‌నుంచి తయారుచేయించింది కావటం విశేషం. ఈ విషయాల్ని సచిన్‌ తనతో చెప్పినట్లుగా రవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సచినే స్వయంగానటించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.