Technology Trends

సరికొత్తగా బజాజ్‌ వీ12!


బజాజ్‌ తన వాహన శ్రేణిలోకి వీ12 వాహనాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్ది మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌తో రూపొందించిన ఈ బైక్‌ ధర రూ.68,400. వీ12లో సింగిల్‌ సిలిండర్‌, 4 స్ట్రోక్‌ ఎయిర్‌కూల్డ్‌ డీటీఎస్‌-ఐ ఇంజిన్‌ ఉండగా, వీ15తో పోలిస్తే బోర్‌, స్ట్రోక్‌ను తగ్గించింది. 124.5సీసీ ఇంజిన్‌, 10.5హెచ్‌పీ పవర్‌, 13 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంకును వీ12 కలిగి ఉంది.
భారత నౌకాదళానికి విశేష సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఉక్కుతో 2015లో బజాజ్‌ ‘వీ’ శ్రేణిలో ఈ ద్విచక్ర వాహనాలను తీసుకొచ్చింది. వీ15 పేరుతో తీసుకొచ్చిన వాహనాలకు విశేష ఆదరణ లభించింది. ఇక 2017 జనవరిలో డ్రమ్‌ బ్రేక్స్‌తో వీ12ను తీసుకురాగా, తాజాగా డిస్క్‌ బ్రేక్‌ను జోడించి వీ12ను విపణిలోకి విడుదల చేసింది.