Latest News

సీఈఓపై ముఖంపై కేక్ తో కొట్టాడు

ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో అలన్‌ జోయిస్‌కు వింత అనుభవం ఎదురైంది. బిజినెజ్‌ మీటింగ్‌లో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి వేదికపైకి వచ్చి అలన్‌ ముఖంపై పై(కేకుపై వాడే క్రీం లాంటి పదార్థం)తో కొట్టాడు. తొలుత అలన్‌ కంగుతిన్నా.. వెంటనే తేరుకుని నవ్వుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
పెర్త్‌లో జరుగుతున్న బిజినెస్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో అలన్‌ మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వేదికపైకి వచ్చి అలన్‌ ముఖానికి క్రీమ్‌ పైను కొట్టి.. ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోయాడు. దీంతో అలన్‌ ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే కోపం తెచ్చుకోకుండా ఓ చిరునవ్వు నవ్వి.. ఒక్కనిమిషం బ్రేక్‌ తీసుకుంటానని చెప్పి.. వెళ్లిపోయారు. ఆ తర్వాత బ్లేజర్‌ తీసేసి వచ్చిన అలన్‌ మాట్లాడుతూ.. ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడే కొట్టండి అని అన్నారు. ఆ వ్యక్తి అలా ఎందుకు కొట్టాడో తెలియదని, కనీసం ఆ కేక్‌ను రుచి చూసే వీలు కూడా లేకుండా పోయిందని అలన్‌ చెప్పడంతో అక్కడివారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇలా కేక్ తో కొట్టడం నిరసనల్లో భాగమట.