Politics

సీఎం యోగి హామీ ఇచ్చాకే..జవాను అంత్యక్రియలు…

పాకిస్థాన్‌ సైనికుల చేతిలో అతి దారుణంగా ప్రాణాలు వదిలిన జవాను ప్రేమ్‌సాగర్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబం నిరాకరించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తమ ఇంటికి వచ్చి జవానుకు నివాళులర్పించేంత వరకు దహన సంస్కారాలు చేయబోమని కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. అంతేగాక జవాను పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీంతో సీఎం యోగి స్పందించి ప్రేమ్‌ సాగర్‌ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. 13వ రోజు నిర్వహించే కర్మకు తప్పకుండా హాజరవుతానని, ప్రేమ్‌కుమార్తెకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బుధవారం ఉదయం అధికార లాంఛనాల మధ్య జవాను అంత్యక్రియలను నిర్వహించారు.
.