crime

సీరియల్ నటుడు ప్రదీప్ ఆత్మహత్య…

 

 

 

 

 

 

 

 

 

తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెల్లవారు జామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుప్పాలగూడ అల్కాపురి కాలనీ గ్రీన్‌ ఇకానియా అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రదీప్ ఆత్మహత్య ప్రస్తుతం మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రదీప్ భార్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సప్తమాత్రిక అనే సీరియల్‌లో ప్రదీప్ హీరోగా నటించాడు. ప్రదీప్ భార్య పావని అగ్నిపూలు అనే సీరియల్‌లో నటిస్తోంది. గత ఏడాది ఆగస్టులో పావనిని ప్రదీప్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.