Trends

సుందర లోయల్లో సాహసం.. తెలంగాణ అమర్ నాథ్ యాత్ర…

లోతైన కొండలు…లోయల మధ్య ప్రకృతి సోయగం…వంద అడుగుల లోతులో లింగమయ్య..ఆదివాసులే ఇక్కడ పూజారులు…ఇదే సలేశ్వర క్షేత్రం. తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా పిలుస్తారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే స్వామి వారు దర్శనం ఇస్తారు. ఆదివారం నుంచి సలేశ్వరం యాత్ర షురూ అయింది. అయిదురోజులపాటు ఈ యాత్ర సాగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉండే ఈ క్షేత్రంలో ఏడాదికి ఒక సారి మాత్రమే ఇక్కడ స్వామి వారు దర్శనమిస్తారు.. లింగాకారంలో ఉండే గుండం మీదుగా స్వామి దర్శనం కోసం భక్తుల వేలాదిగా తరలివస్తున్నారు..
లోతైన కొండల్లో వెలిసిన స్వామిఎతైన కొండ, లోయల మధ్యన పూర్వం నుం చి ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు. మొదటి నుంచి ఆదివాసులే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి సలేశ్వరం ఉత్సవాలకు భక్తులు వస్తున్నారు.. శివుడు పెద్ద కొండ కింద కేవలం పది అడుగుల స్థలంలో వెలిశాడు. నల్లమలలో జరిగే సలేశ్వరం ఉత్సవాలకు భక్తు లు వస్తున్నాం లింగమయ్య.. పోయివస్తాం లింగమయ్య అంటూ భక్తిపారవశ్యంతో ముందుకు సాగుతారు.
ఇది సాహస యాత్రే..
కొండలు, గుట్టలు దాటుతూ ఈ క్షేత్రానికి చేరుకోవాలి. కనువిందు చేసే జలపాతం…కీకారణ్యం మార్గంలో కాలినడకన చేరుకున్న భక్తులకు సుమారు 200 అడుగులపై నుంచి జారే జలపాతం ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం ఎక్కడ నుంచి పారుతుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అన్ని కాలాల్లో ఈ నీరు జాలువారుతూనే ఉంటుంది.లింగాకారంలో గుండం..సలేశ్వరం దగ్గర జాలువారిన జలపాతంతో రెం డు కొండల మధ్యన సహజసిద్ధంగా గుం డంగా ఏర్పడింది. ఈ గుండం చూడటానికి లింగాకారలంలో ఉంటుంది. దీని లోతు సుమారు వం ద అడుగులు ఉంటుంది. అయితే గతంలో జలపాతంపై నుంచి జారిపడి కొందరు యాత్రికులు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. అం దుకే ఈ గుండపై నడిచేపటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

సలేశ్వరానికి ఎలా వెళ్లాలి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం ఉత్సవాలకు వనపర్తి డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయి. ఉత్సవాల జరిగే మూడు రోజుల పాటు బస్సులు నడుస్తాయి. .గోపాల్‌పేట మీదుగా ఏదుట్ల, ఏదుల, తీగలపల్లి, పెద్దకొత్తపల్లి, లింగాల, అచ్చంపేట, మన్ననూరు వరకు 170 కిలోమీటర్లు ఉండగా రూ.205 చార్జీ నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట మీదుగా 210 కిలోమీటర్ల దూరం ఉండగా రూ.250 బస్సు చార్జీని వసూలు చేయనున్నట్లు వివరించారు. యాత్రకోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక సలేశ్వరం జాతరకు వచ్చే వాహనాలకు అటవీ శాఖ అధికారులు ఐదేళ్లుగా టోల్ గేట్ వసూలు చే స్తున్న్తారు. ద్విచక్ర వాహనాల నుంచి అన్ని రకాల వాహనాలకు, ఆర్టీసీ బస్సులకు రూ.10 నుంచి రూ.200 వరకు టోల్‌గేట్ వసూలు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతి ఏడాది రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుంది.ప్లాస్టిక్ కవర్లు నిషేధంసలేశ్వరం ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలిరానుండడంతో అటవీ శాఖ అధికారులు ఇక్కడ ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని విధించారు.