Latest News Technology

సోలార్ కారు..హర్యానా బాలుడి అద్భుత సృష్టి

మొన్న చైన్నై బాలుడు మాట్లాడే రోబో సృష్టిస్తే… ఇవాళ హర్యానా కుర్రాడు సోలార్ తో నడిచే మూడుచక్రాల వాహనాన్ని సృష్టించాడు. త్వరలోనే సోలార్‌ కారు కూడా తయారు చేస్తానని అన్వీత్‌ చెబుతున్నాడు. కాలుష్య రహిత, అందరికీ అందుబాటులో ఉండే ధరలో వాహనం రూపొందించడం విశేషం. గంటకు 20 కి.మీ వేగంతో నడిచే వాహనంలో పలురకాల ఫీచర్లు ఉన్నాయి. ఛార్జింగ్‌ పోర్టులు, యాంటీ స్లీపింగ్‌ అలారం సిస్టమ్‌ వంటి హంగులను జత చేశాడు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టార్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

భవిష్యత్తులో సోలార్‌ కారును తయారు చేయడమే తన లక్ష్యమని అన్వీత్‌ అంటున్నాడు.