Featured2 Latest News

స్కైప్‌ డైవోర్స్!

ఇప్పుడు అంతా హైటెక్ యుగం..పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రిపడుకునేదాకా నెట్టింట్లో గడపాల్సిందే..వీడియో కాలింగైనా.. పెళ్లిచూపులైనా అంతా నెట్ లోనే..ఆఖరుకు విడాకులు కూడా నెట్టింట్లోకి వచ్చాయి.

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ జంటకు 2015లో పెళ్లి జరిగింది. ఉద్యోగనిమిత్తం ఆమె లండన్‌కు, ఆయన సింగపూర్‌కు వెళ్లాల్సివచ్చింది.భిన్నాభిప్రాయాలు, వేర్వేరు జీవిత గమ్యాల దృష్ట్యా వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ 2016లో సివిల్‌ జడ్జి మల్కనపట్టె రెడ్డి ఎదుట విడాకుల అభ్యర్థనను దాఖలుచేశారు.
శనివారం కేసు విచారణకు రాగా ఆమె లండన్ లో..అతను పుణేలో ఉన్నారు. సెలవు దొరక్కపోవడంతో ఆమె కోర్టుకు రాలేకపోయింది. దీంతో లండన్‌లో ఉన్న ఆమెను స్వైప్‌ ద్వారా విచారించి న్యాయమూర్తి విడాకులు మంజూరుచేశారు.

వీడియో కాలింగ్‌ యాప్‌ ‘స్కైప్‌’. దూరప్రాంతాల్లోని సన్నిహితులను వీడియో ద్వారా మన ముందు నిలబెడుతూ బంధాలను బలపరచడంలోనే కాదు విడాకులు ఇప్పించడంలోనూ దిట్ట. ఇదే యాప్‌ వేదికగా ఈ జంట విడాకులు తీసుకుంది. పుణె సివిల్‌ న్యాయస్థానం శనివారం వీటిని జారీచేసింది.