Politics

స్వచ్ఛతలో ఇండోర్ ఫస్ట్ .. యూపీ లాస్ట్..

 

 

 

 

 

 

 

 

 

 

 

స‌్వ‌చ్ఛ రేటింగ్స్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని ప‌ది స్వ‌చ్ఛ న‌గ‌రాల‌ జాబితాను ప్ర‌క‌టించింది. ఇందులో తొలి రెండు స్థానాల్లో మ‌ధ్య ప్ర‌దేశ్‌కు చెందిన‌వే కావ‌డం విశేషం. తొలి స్థానంలో ఇండోర్‌, రెండోస్థానంలో భోపాల్ నిలిచాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తోపాటు గుజ‌రాత్‌, ఏపీ, జార్ఖండ్‌లోని న‌గ‌రాలు ఈ జాబితాలో మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఇక‌ అత్యంత చెత్త న‌గ‌రాల్లో 25 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే ఉన్నాయి. గుజ‌రాత్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లోని న‌గ‌రాలు స్వ‌చ్ఛ ర్యాంకుల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధిస్తున్నాయ‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు తెలిపారు.
ఒక్క ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి మినహా మిగతా పట్టణాలన్నీ చివరి ర్యాంకుల్లోనే ఉన్నాయి. మొత్తం 434 పట్ణణాలున్న ఈ జాబితాలో వారణాశి 32వ ర్యాంకు దక్కించుకుంది.
యూపీలోని గోండా పట్టణం స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాబితాలో 434వ ర్యాంకుతో చివరి స్థానంలో ఉంది. ఇదే రాష్ట్రంలోని హర్దోయ్‌ 431వ ర్యాంకులో ఉంది. చివరి పది పట్ణణాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి 5, బిహార్‌ నుంచి 2, పంజాబ్‌ నుంచి 2, మహారాష్ట్ర నుంచి ఒకటి ఉన్నాయి. చివరి ఐదు పట్టణాలివే..
* గోండా(యూపీ)-434వ ర్యాంకు
* భస్వాల్‌(మహారాష్ట్ర)-433
* బగాహా(బిహార్‌)-432
* హర్దోయ్‌(యూపీ)-431
* కతిహార్‌(బిహార్‌)-430
ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌రిశుభ్ర‌త ఆధారంగా దేశంలో 500 న‌గ‌రాల జాబితాను కేంద్రం ప్ర‌క‌టిస్తుంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 4న ప్రారంభించిన స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ కార్య‌క్ర‌మం కింద ఈ జాబితాను విడుద‌ల చేస్తున్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 37 ల‌క్ష‌ల మంది పౌరుల అభిప్రాయాలు తీసుకొని ఈ జాబితాను విడుద‌ల చేసింది.