Featured Movies

హీరోయిన్ మరీ సెక్సీగా ఉందని..

హీరోయిన్ ఎంత సెక్సీ గా ఉంటే సినిమాకు అంతప్లస్..అలాంటి నటి దొరికిందంటే డైరెక్టర్లు, నిర్మాతలకు పండుగే.ప్రేక్షకులకూ పసందే.. సూపర్ సెక్సీ హీరోయిన్ తోనే మూవీస్ తీయడానికి నిర్మాతలు క్యూ కడుతారు. కానీ కాంబోడియాలో సీన్ రివర్స్..మరీ సెక్సీగా ఉండటమే ఈ హీరోయిన్ కు మైనస్ అయింది. హీరోయిన్ మరీ సెక్సీగా ఉందని పేర్కొంటూ ఆమెపై ఏడాదిపాటు నిషేధం విధించారు.
కాంబోడియాకు చెందిన డెన్నీ క్వాన్(24) పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఆమె మరీ సెక్సీగా ఉందంటూ సాంస్కృతిక శాఖ అధికారులు ఆమెపై ఏడాదిపాటు నిషేధం విధించారు. క్వాన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. అంతేకాదు ఆమెకు కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ మినిస్ట్రీతో ఈ విషయంలో అవగాహన క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే ఆమెపై నిషేధం విధించడం సరికాదని ఫేస్‌బుక్‌లో ఆమెను ఫాలో అవుతున్న 3 లక్షల మంది అభిమానులు అంటున్నారు. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె పెద్దగా అభ్యంతరకర సన్నివేశాల్లో నటించడం లేదంటూ బాసటగా నిలిచారు. ‘‘కాంబోడియాలో బోల్డంతమంది సెక్సీ ఆర్టిస్టులు ఉన్నారు. షూటింగ్ సమయంలో కొందరు నాకంటే బోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు’’ అని క్వాన్ అంటోంది. తాను ఎటువంటి దుస్తులు వేసుకోవాలనేది తన ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందన్న ఈ ముద్దుగుమ్మ దేశ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి ఇకముందు మరీ అంత సెక్సీగా ఉండకుండా జాగ్రత్తపడతానని చెబుతోంది.