Technology

హెలికాప్టర్‌తో ఇంటర్నెట్‌ !

భారీ వర్షాలు, తుపాన్లు , భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పడు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫోన్లు, ఇంటర్నెట్ లతో పాటు ఏవీ పనిచేయవు.ఇలాంటి సమయంలో కమ్యూనిషకేషన్ ఉండేలా ఫేస్ బుక్ ప్రయత్నాలు చేస్తోంది. హెలికాప్టర్ తో ఇంటర్నెట్ సేవలు అందించాలని ఆలోచిస్తోంది.

అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం సరికొత్త ప్రయత్నం చేస్తోంది. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో గగనతలం నుంచి ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా ‘టిథర్‌-టెన్నా’ అనే చిన్నపాటి హెలికాప్టర్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపింది.
తుపాన్లు.. భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. సాంకేతికత సమస్యలు తలెత్తినప్పుడు ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడితే వెంటనే అక్కడికి ఈ హెలికాప్టర్‌ను పంపించొచ్చట. దాంతో గగనతలం నుంచి ఆ ప్రాంతంలో అప్పటికప్పుడు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించే వీలుంటుందని ఫేస్‌బుక్‌ తెలిపింది.