Featured2 Sports

హ్యాపీ బర్త్ డే సచిన్

క్రికెట్‌ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ 44వ జన్మదినం ఇవాళ. క్రికెట్ గాడ్ పుట్టినరోజు వేడుకలంటే అభిమానులకు పండగే. క్రికెట్‌ దేవుని జన్మదిన వేడుకలను పలు ప్రాంతాల్లో వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు సచిన్‌కు క్రికెటర్లు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
‘హ్యాపీ బర్త్‌డే సచిన్‌’.అత్యంత స్ఫూర్తిమంతమైన క్రీడాకారుడిని ప్రపంచం చూస్తోంది. అద్భుతమైన కాలం మీ ముందుందని ఆశిస్తున్నాను.’ -అనిల్‌ కుంబ్లే, టీమిండియా ప్రధాన కోచ్‌

‘సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. భారత్‌లో సమయాన్ని సైతం ఆపగలిగే గాడ్‌జీ నా పక్కనే నిద్రపోతున్నాడు’ – సెహ్వాగ్‌
‘సచిన్‌కు ప్రత్యేకమైన బర్త్‌డే శుభాకాంక్షలు’ -బీసీసీఐ

‘కోట్లాది అభిమానుల హృదయాలను సచిన్‌ గెలుచుకున్నాడు. జన్మదినం సందర్భంగా అతనికి కోట్లాది శుభాకాంక్షలు.’ – ముంబయి ఇండియన్స్‌ జట్టు
‘క్రికెట్‌ దేవుడు, భారత రత్నకు జన్మదిన శుభాకాంక్షలు.’ -విజేందర్‌ సింగ్‌, బాక్సర్‌
‘మాస్టర్‌ బ్లాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మా అందరికీ మీరు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు’ – ఆర్పీ సింగ్‌
‘సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఏప్రిల్‌ 24న భారత క్రికెట్‌ డే. మీతో కలిసి ఆడటం నా అదృష్టం’ -రవిచంద్రన్‌ అశ్విన్‌
‘మాస్టర్‌ బ్లాసర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.’ రోహిత్‌ శర్మ