Movies

100% నరకానికే..నో డౌట్..!

 

 

 

 

 

 

 

 

 

దర్శక ట్విట్టర్ రాంగోపాల్ వర్మ తనదైన స్టయిల్లో కామెంట్లు, పంచ్ లు విసురుతూ జనం నోళ్లలో నానుతుంటాడు. తాను చనిపోతే కచ్చితంగా నరకానికే వెళ్తానని.. కనీసం ఇక్కడున్నంతవరకైనా స్వర్గాన్ని ఎంజాయ్‌ చేయనివ్వండని అంటున్నాడు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఎప్పుడూ సెలబ్రెటీలపై, ఇతర విషయాలపై సోషల్‌మీడియాలో స్పందించే వర్మ ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘‘నేను ట్విటర్‌ రాజుని కాను. చెప్పాలంటే నేనో జోకర్‌ని. ఇతరులపైనే కాదు నాపైనా జోకులు వేస్తుంటాను. కానీ ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏదేమైనా ఇతరుల గురించి తప్పుగా విమర్శలు చేయనని వినాయకుడిపై ఒట్టేశాను. సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటాను కానీ నెగిటీవ్‌గా ఎలాంటి వ్యాఖ్యలు చేయను. ఇక నా జీవితం గురించి చెప్పాలంటే రోజూ నాకు ఇదో జర్నీ. ప్రతి ఉదయం నేను కొత్తగా పుడతాను. రాత్రికి చనిపోతాను. ఏం చేసినా ఆ పన్నెండు గంట్లోనే చేస్తాను. నా కోరిక ఈ రోజుకి నేను హాయిగా జీవించడం. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను చచ్చాక కచ్చితంగా నరకానికే వెళతానని. అలాంటప్పుడు నేను బతికున్నన్ని రోజులు ఎంజాయ్‌ చేస్తూ ఇక్కడే స్వర్గాన్ని వెతుక్కుంటాను. నాకు ఈ విషయంపై బాగా క్లారిటీ ఉంది.’’ అని చెప్పుకొచ్చారు వర్మ.