Latest News Sports

టెన్నిస్ ప్లేయ‌ర్ సెరీనా విలియ‌మ్స్ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె ప్ర‌తినిధి వెల్ల‌డించాడు. దీనికి సంబంధించి ఆమె తాజాగా స్నాప్‌చాట్‌లో ఓ ఫోటోను అప్‌డేట్ చేసింది. స్విమ్‌షూట్‌లో ఉన్న ఆ ఫోటోకు 20 వారాలు అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ఆ రెండు ప‌దాల టైమ్‌లైన్‌ను బ‌ట్టి చూస్తే, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన‌ప్పుడు కూడా సెరీనా విలియ‌మ్స్‌ ప్రెగ్నెంట్ అన్న విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన 35 ఏళ్ల సెరీనా ఈ ఏడాది మ‌ళ్లీ టెన్నిస్ రాకెట్ ప‌ట్టే సంద‌ర్భాలు ఉండ‌వ‌ని తెలుస్తున్న‌ది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో త‌న బాయ్‌ఫ్రెండ్ గురించి సెరీనా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. రెడ్డిట్ కోఫౌండ‌ర్ అలెక్సిస్ ఒహనియ‌న్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు ఆమె చెప్పింది. జ‌న‌వ‌రిలో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన త‌ర్వాత సెరీనా మ‌ళ్లీ టెన్నిస్ టోర్నీలు ఆడ‌లేదు. ఇండియా, మియామీ టోర్నీల‌కు దూరంగా ఉంది. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఫ్రెంచ్ ఓపెన్, ఆ త‌ర్వాత వింబుల్డ‌న్‌, యూఎస్ ఓపెన్‌ల‌కు కూడా సెరీనా దూరంకానున్న‌ది. త‌న ఫోటోపై పోస్ట్ చేసిన ట్యాగ్‌లైన్ ప్ర‌కారం సెరీనా సెప్టెంబ‌ర్‌లో అమ్మ అయ్యే ఛాన్స్ ఉంది.