Technology

లైవ్ స్కూల్స్…కళ్ల ముందు క్లాస్ రూమ్..!

స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు..టీచర్లు పాఠాలు సరిగ్గానే చెబుతున్నారా..పిల్లలు లెసన్స్ ని ఎలా వింటున్నారు.. క్లాస్ లో ఎవరెలా ఉంటున్నారు..వారి ప్రవర్తన ఏంటో తెలుసుకోవాలంటే..క్లాస్ వెళ్లి ప్రత్యక్షంగా చూస్తే కాని తెలియదు.ఇలా ప్రతిసారీ స్కూల్ కు వెళ్లడం వీలుకాదు.అందుకే స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తగరతి గదిలో పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకునేలా చైనాకు చెందిన ‘షుఇది జిబో’ అనే సంస్థ దేశవ్యాప్తంగా పలు స్కూళ్లలో ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇస్తోంది.

సాధారణంగా స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటిని మానిటర్‌ ద్వారా స్కూల్‌ యాజమాన్యం పర్యవేక్షిస్తుంటుంది. కానీ.. తల్లిదండ్రులకు కూడా వారి పిల్లలు స్కూల్‌లో ఏ విధంగా నడుచుకుంటున్నారో తెలుసుకునేలా ఈ సంస్థ లైవ్‌ స్ట్రీమింగ్‌ అమలు చేస్తోంది. తరగతిలో.. కారిడార్‌లో.. భోజనశాలలో.. చివరికి నిద్రించే గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టి తల్లిదండ్రులకు చూపిస్తున్నారు. స్కూళ్ల యాజమాన్యాలు కూడా టీచర్లు పాఠాలు సరిగా చెప్పట్లేదని.. విద్యార్థుల్ని కొడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తుంటారు. ఈ విధానం ద్వారా పిల్లలకు పాఠాలు చెబుతున్నారో.. లేదో వారి సందేహం తీరుతుంది కదా! అని అంటున్నారు.
అయితే ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ విధానంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఇది వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలిగించే విషయమని.. చట్టరీత్యా నేరమని కూడా అంటున్నారు.