Trends

23ఎంపీ కెమెరాతో సోనీ న్యూ స్మార్ట్‌ఫోన్‌

సోనీ సరికొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌పీరియా సిరీస్‌లో ఎక్స్‌ఏ1 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధరను రూ.19,990గా ప్రకటించింది. 23 మెగాపిక్సల్‌ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకత. గత ఏడాది విడుదల చేసిన సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ తర్వాతి మోడల్‌గా ఎక్స్‌ఏ1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఈ ఫోన్‌ను బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఆవిష్కరించారు. భారత్‌లో ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1 ఫోన్‌ వైట్‌, బ్లాక్‌, పింక్‌ కలర్‌ వేరియంట్లలో లభ్యమవుతుంది. సోనీ సెంటర్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన ఎలక్ట్రానిక్‌ స్టోర్స్‌లో ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.
ఎక్స్‌ఏ1 ఫోన్‌ ఫీచర్లు..
* 5 అంగుళాల తెర
* ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* 23ఎంపీ వెనుక కెమెరా
* 8ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
* 3జీబీ ర్యామ్‌
* 32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* ఆండ్రాయిడ్‌ 7.0
* 4జీ సదుపాయం
* 2300ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ