Featured Latest News Movies

క్రిష్ …లక్ష్మీభాయ్గా కంగనా..!

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ క్రిష్ ..తరువాత మూవీని కూడా మరో చారిత్రక గాథ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సారి జాతీయ స్థాయిలో బాలీవుడ్లో సినిమాచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక అనే సినిమాను తీయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న మణికర్ణిక సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పెన్సిల్ స్కెచ్లా ఉన్న ఈ పోస్టర్ లో కంగనా లక్ష్మీభాయ్ లుక్లో ఆకట్టుకుంటోంది. అయితే క్రిష్, ఈ లుక్ పై అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు.